ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీని గెలిపించే బాధ్యత ప్రజలదే..

ABN, First Publish Date - 2021-03-07T06:51:26+05:30

జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత నగరవాసులపైనే ఉందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు అన్నారు.

ఆరిలోవ రోడ్‌ షోలో విజయసంకేతం చూపిస్తున్న చంద్రబాబు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు

కొమాది/ఆరిలోవ, మార్చి 6: జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత నగరవాసులపైనే ఉందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి పెదగదిలి, పీఎంపాలెంలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ పాలన అంతా అన్నింటిపై బాదుడు, కూల్చివేతలతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. అమ్మఒడి నాన్న బుడ్డీలకు చాలడం లేదని విమర్శించారు. ఆటోడ్రైవర్లకు రూ.15 వేలిచ్చి రూ.50 వేల వరకు పలు ట్యాక్సీలతో వారి పొట్ట కొడుతున్నారన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలతో జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు. విశాఖ అంతా స్వామిజీ  మహిమతో నిండిపోయిందని.. ఆయనను దర్శించుకుంటే అధికారులకు బదిలీలు ఉండవని, పెత్తనమంతా స్వామీజీ చేతిలో పెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. తమ హయాంలో స్వచ్ఛ ర్యాంకింగ్‌లో విశాఖ మూడో స్థానంలో ఉండగా.. ఇప్పుడు 86వ స్థానానికి చేరిందని, ఇదంతా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఇచ్చిన సైకిల్‌ను ప్రదర్శించి అందరూ ఈ గుర్తుకే ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ను విదేశీయులకు అమ్మిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు. వార్డు అభ్యర్థులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయడు, నాయకులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T06:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising