ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాన కురుస్తూనే ఉంది

ABN, First Publish Date - 2021-07-24T06:10:02+05:30

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల శుక్రవారం ఉదయం నుంచి నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎస్‌.రాయవరం మండలం తిమ్మాపురం- రేవుపోలవరం రహదారిలో వర్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  

 నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో రోజంతా కుండపోత

 లోతట్టు ప్రాంతాలు జలమయం 8 రాకపోకలకు జనం ఇబ్బందులు

ఎస్‌.రాయవరం/నక్కపల్లి, జూలై 23 : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల శుక్రవారం ఉదయం నుంచి నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ఎనిమిది గంటల వరకూ కుండపోతగా పడుతూనే ఉంది. పలు గ్రామాల్లో రహదారులు జలమయమయ్యాయి.  రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నక్కపల్లి నుంచి ఉపమాక  మీదుగా రాజయ్యపేట వెళ్లే ప్రధాన రహదారి అడుగడుగునా గోతులతో నిండి అధ్వానంగా కనిపిస్తోంది. వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. అదేవిధంగా జానకయ్యపేట రహదారి కూడా వర్షాలకు దెబ్బతింది. అలాగే, ఎస్‌.రాయవరం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  అల్పపీడన ప్రభావం వల్ల రేవుపోలవరం, కొత్తరేవుపోలవరం, బంగారమ్మపాలెం గ్రామాల్లోని మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్ల వద్దని అధికారులు సూచించారు. రైతులు ఖరీఫ్‌  పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారీ వర్షాల వల్ల పంట పొలాల్లో సమృద్ధిగా  నీరు చేరుతోంది.

Updated Date - 2021-07-24T06:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising