ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌ పేరిట పేదల్ని దోచుకోవడం తగదు

ABN, First Publish Date - 2021-12-05T05:44:33+05:30

చాలా ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు ఇప్పుడు శాశ్వత హక్కు కల్పిస్తామని మాయమాటలు చెప్పి వైసీపీ ప్రభుత్వం పేదల్ని దోచుకోవడం తగదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు.

దిగువ సొలములులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ గౌరవ సభలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి 

పాడేరు, డిసెంబరు 4: చాలా ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు ఇప్పుడు శాశ్వత హక్కు కల్పిస్తామని మాయమాటలు చెప్పి వైసీపీ ప్రభుత్వం పేదల్ని దోచుకోవడం తగదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. మండలంలో ఇరడాపల్లి దిగవ సొలములు గ్రామంలో శనివారం నిర్వహించిన టీడీపీ గౌరవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు శాశ్వత హక్కు అంటూ రూ.10 వేలు నుంచి రూ.40 వేలు వరకు అక్రమంగా వసూలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం ఘోరమన్నారు. గిరిజనులు ఏటీఎస్‌ కోసం ఒక్క పైసా ప్రభుత్వానికి చెల్లించద్దన్నారు. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు మాత్రమే శ్రద్ధ చూపుతున్నారన్నారు. అలాగే మంత్రుల దుషణలు, అసెంబ్లీలో భువనేశ్వరిని ఘోరంగా అవమానించడం వంటి ఘటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్‌, ఐటీడీపీ ఇన్‌ఛార్జి బుద్ద జ్యోతికిరణ్‌, నాయకులు బడ్నాయిని రాంబాబు, రేగం కొండబాబు, భాస్కరరావు, వెంకటేశ్వర్లు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-05T05:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising