ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరకొండలో తవ్వకాలపై విచారణ

ABN, First Publish Date - 2021-10-27T06:39:40+05:30

మండలంలోని అన్నవరం ఊరకొండ ప్రాంతంలో అక్రమంగా కొందరు గ్రావెల్‌ తవ్వి, నిర్మాణాలు చేపడుతు న్నారని ఇటీవల నర్సీపట్నంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అనకాపల్లి మైనింగ్‌, స్థాని రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

కొండ ప్రాంతంలో సామిల్‌ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  నర్సీపట్నంలో కలెక్టర్‌ నిర్వహించిన స్పందనలో పలువురు ఫిర్యాదు 

ఈ మేరకు స్పందించిన అధికారులు

కోటవురట్ల, అక్టోబరు 26 : మండలంలోని అన్నవరం ఊరకొండ ప్రాంతంలో అక్రమంగా కొందరు గ్రావెల్‌ తవ్వి, నిర్మాణాలు చేపడుతు న్నారని ఇటీవల నర్సీపట్నంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అనకాపల్లి మైనింగ్‌, స్థాని రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. బహిరంగంగా తవ్వుకుపోతున్నాఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.  ఇక్కడ భూమి చదును పేరుతో రాత్రి సమయంలో భారీఎత్తున యం త్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. వాస్తవంగా ప్రభుత్వ భూమి తవ్వినా, జిరాయితీ భూమి తవ్వకాలు జరిపినా మైనింగ్‌ అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. కోటవురట్ల మండలం అన్నవరం గ్రామంతో పాటు నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆఽధ్వర్యంలో గ్రావెల్‌ అక్రమ రవాణా ద్వారా రెండు కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టు ఈఏడాది జనవరిలో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది.  చదును పేరుతో గ్రావెల్‌ తవ్వకాలు చేసిన ప్రాంతంలో ఇప్పుడు కర్రల సామిల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్ధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు విచారణకు విచ్చేశారు. ఇదిలావుంటే, ఈ విషయంపై సదరు అధికారులకు వివరణకోగా, కారులో ఉండి పేపర్లు అడ్డుపెట్టుకొని వారు స్పందించకపోవడం గమనార్హం. గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన ప్రాంతం ప్రభుత్వ భూమిగా భావిస్తున్నామని డిప్యూటీ తహసీల్దార్‌  సోమశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2021-10-27T06:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising