ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలు మూసివేయడం సరికాదు

ABN, First Publish Date - 2021-04-20T05:30:00+05:30

ఆకస్మికంగా పాఠశాలలు మూసివేయాలని తీసుకున్న నిర్ణయం సరికాదని ఏపీ ప్రవేటు స్కూల్స్‌ జాయింగ్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రవేటు పాఠశాలల యాక్షన్‌ కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి
ప్రైవేటు స్కూల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 20:
ఆకస్మికంగా పాఠశాలలు మూసివేయాలని తీసుకున్న నిర్ణయం సరికాదని ఏపీ ప్రవేటు స్కూల్స్‌ జాయింగ్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం వడ్డాదిలో కమిటీ ప్రతినిధులు వీవీ రామరాజు, పి.రమణ, సిహెచ్‌.రాంబాబు, టి.వరప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నైపథ్యంలో కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం పాఠశాలలను మూసి వేస్తున్నట్టుగా ప్రకటించడంతో ప్రవేటు పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌తో పాఠశాలలు నడవని కారణంగా సక్రమంగా ఫీజులు వసూలు కాక కొన్ని విద్యా సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయని వాపోయారు. దీంతో ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ స్కూల్స్‌ మూసివేయడంతో రాష్ట్రంలో 11 వేలకుపైగా నిరుద్యోగ కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని వారు వాపోయారు. వారిని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising