ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలు

ABN, First Publish Date - 2021-10-24T06:06:11+05:30

ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి ఆక్వా సాగుదారుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా మత్స్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా సాగుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్టు చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఫిషరీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ కోటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  అడిషనల్‌ కమిషనర్‌ కోటేశ్వరరావు 

నక్కపల్లి, అక్టోబరు 23 : ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి ఆక్వా సాగుదారుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా మత్స్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా సాగుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్టు చెప్పారు. రైతులకు 18 శాతం రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా కావల్సిన ఫీడ్‌ విక్రయి స్తున్నారన్నారు. ఆక్వా అథారిటీ ద్వారా రొయ్యల చెరువుల రిజిస్ర్టేషన్‌, ఫీడ్‌ మిల్లులు, ల్యాబ్‌లు, ప్రోసెసింగ్‌ యూనిట్ల రిజిస్ర్టేషన్‌ చేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఒంగోలులో మాత్రమే టైగర్‌ సీడ్‌ పెంచి విక్రయించేందుకు అనుమతులున్నాయన్నారు. ప్రతి నెలా ఆక్వా సాగుకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం రొయ్యల పెంపకంలో వైట్‌ స్పాట్‌ వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు మాతా గుర్నాథరావు, జేడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T06:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising