ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవరాజాంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

ABN, First Publish Date - 2021-06-23T05:59:08+05:30

ఆవరాజాం పంచాయతీ పరిధిలోని ఉర చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

ఇంటి పునాదిలో వేసిన చెరువు మట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డుకున్న సర్పంచ్‌పై దాడికి యత్నం

అచ్యుతాపురం, జూన్‌ 22:
ఆవరాజాం పంచాయతీ పరిధిలోని ఉర చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు మూడు రోజులుగా భారీగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారు. ఎక్సవేటర్‌ సహాయంతో తవ్వకాలు చేసి లారీల ద్వారా ఇతరుల భవనాల పునాదులు కప్పటానికి తరలిస్తున్నారు. కాగా, తాను చెరువులోకి వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నానని సర్పంచ్‌ నానాజీ తెలిపారు. అంతేకాక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే వైసీపీ నాయకులు తన ఇంటికి వచ్చి బెదిరించారని ఆయన తెలిపారు. జగనన్న ఇళ్ల పేరు చెప్పి వైసీపీ నాయకులు మట్టిని ఇతరులకు విక్రయించేస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపితే విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-23T05:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising