ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మద్దతుగా భారీ బైక్‌ ర్యాలీ

ABN, First Publish Date - 2021-01-27T05:56:15+05:30

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం వివిధ రాజకీయ, ప్రజా, పౌర, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన బైక్‌ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం, జనవరి 26: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం వివిధ రాజకీయ, ప్రజా, పౌర, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ రామాటాకీ స్‌ మీదుగా మద్దిలపాలెం, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా తిరిగి గాంధీ విగ్రహం వద్దకు చేరింది. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, జాతీయ జెండాలను చేతపట్టుకుని, టీషర్ట్‌లు ధరించి ప్రదర్శన చేపట్టారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ రైతులకు తీవ్ర విఘాతం కలిగించే నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, కాంగ్రెస్‌ నాయకులు జీఏ నారాయణరావు, పేడాడ రమణికుమారి, ఎస్‌.వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకులు ఎం.లక్ష్మి, ఎంసీసీఐయూ నాయకుడు కె.శంకరరావు, ఏపీ మహిళా అధ్యక్షురాలు ఎ.విమల, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising