ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోరాహోరీగా బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-12-26T05:47:06+05:30

స్థానిక రాజీవ్‌గాంధీ క్రీడామైదానంలో 7వ రాష్ట్రస్థాయి అంతర జిల్లాల స్ర్తీ, పురుష బాల్‌ బాడ్మింటన్‌ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. ఎలమంచిలి బాల్‌ బాడ్మింటన్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి, అనంతపురం జట్ల మధ్య పోరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలమంచిలి, డిసెంబరు 25: స్థానిక రాజీవ్‌గాంధీ క్రీడామైదానంలో 7వ రాష్ట్రస్థాయి అంతర జిల్లాల స్ర్తీ, పురుష బాల్‌ బాడ్మింటన్‌ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. ఎలమంచిలి బాల్‌ బాడ్మింటన్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులకు తీసిపోని విధంగా  బాలికలు సత్తా చాటుతున్నారు. పాయింట్ల పట్టిక ఆధారంగా ఏ పూల్‌, బి పూల్‌ నుంచి రెండేసి జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయని, సెమీఫైనల్‌, ఫైనల్‌ ఆదివారం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. స్థానిక సంఘం ప్రతినిధులు ఆదినారాయణ, గొర్లె రామకృష్ణ, వీరప్రజానాయక్‌ తదితరులు పోటీలను పర్యవేక్షిస్తున్నారు.


సెమిస్‌కు చేరిన జట్లు

పురుషుల జట్టులో పూల్‌ ఎ నుంచి విశాఖపట్నం, కర్నూలు, పూల్‌ బి నుంచి అనంతపురం, ప్రకాశం జట్లు, మహిళల విభాగంలో పూల్‌ ఏ నుంచి విశాఖ, నెల్లూరు జట్లు సెమీఫైనల్‌ చేరాయని, సమయం చాలక మహిళల పూల్‌ బి జట్లకు పోటీ నిర్వహించలేదని నిర్వాహక సంఘం ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. 


Updated Date - 2021-12-26T05:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising