ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనధన్‌ వికాస కేంద్రాల ద్వారా అటవీ ఉత్పత్తులకు అధిక ధరలు

ABN, First Publish Date - 2021-07-27T05:50:53+05:30

వనధన్‌ వికాస కేంద్రాల ద్వారా అటవీ ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ అన్నారు.

శివలింగపురంలో అడ్డాకులప్లేట్‌ తయారీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ

అనంతగిరి, జూలై 26: వనధన్‌ వికాస కేంద్రాల ద్వారా అటవీ ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని కొత్తూరు పంచాయతీ శివలింగపురంలో వన్‌ధన్‌ వికాస కేంద్రాన్ని మంగళవారం అరకులోయ, పాడేరు శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ 300 సభ్యులతో వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అడ్డాకులతో ప్లేట్లు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అటవీ ఉత్పత్తులకు అధిక ధరల కోసం వన్‌ధన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడ్డాకులు, ఉసిరి, చింతపండు, పైనాపిల్‌, పసుపు వంటి ఉత్పత్తులను ప్రోసెసింగ్‌ చేసి మార్కెట్‌లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యేలు ఫాల్గుణ, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనులకు ఆర్థిక భరోసా కల్పించే వన్‌ధన్‌ వికాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరింత అధ్యయనం చేసి మంచి ఫలితాలు ఇచ్చే యంత్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఏపీడీ మురళి, డీపీఎం సత్యంనాయుడు, ఎంపీడీఓ నగేష్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఏపీఎం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T05:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising