ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతి చెందిన అధ్యాపకుని కుటుంబానికి సాయం

ABN, First Publish Date - 2021-06-22T05:25:18+05:30

కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తూ కరోనా బారినపడి గత నెల చనిపోయిన ఎం.వెంకటరావు కుటుంబానికి కళాశాల అధ్యాపకులు, ఇతర దాతలు రూ.3.5 లక్షల రూపాయల సాయం అందించారు.

నగదు అందిస్తున్న ఎమ్మెల్సీ రఘువర్మ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచరపాలెం,జూన్‌ 21 : కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తూ కరోనా బారినపడి గత నెల చనిపోయిన ఎం.వెంకటరావు కుటుంబానికి కళాశాల అధ్యాపకులు, ఇతర దాతలు రూ.3.5 లక్షల రూపాయల సాయం అందించారు. సోమవారం కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ హాజరై ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణతో కలిసి బాధితుని కుటుంబ సభ్యులకు ఈ మొత్తం అందించారు. ఈ సందర్భంగా రఘువర్మ మాట్లాడుతూ గణిత విభాగంలో కాంట్రాక్టు అధ్యాపకునిగా వెంకటరావు ఉత్తమ సేవలందించారని ప్రశంసించారు.


అటువంటి వ్యక్తి చనిపోయి కుటుంబం కష్టాల్లో పడినప్పుడు మానవత్వంతో ఆదుకున్న కళాశాల అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌, పాలిటెక్నిక్‌ ఆల్‌మేథమెటిక్స్‌ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ బి.వి.లక్ష్మణరావు, జె.జయప్రకాష్‌రెడ్డి, ఎస్‌.కనకరావు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న వారికి మృతుని భార్య వరకనక సత్యవతి  కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising