ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురుగాలులతో భారీ వర్షం

ABN, First Publish Date - 2021-04-14T05:36:06+05:30

ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం చెందారు.

పాడేరులో వర్షం కురుస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోతట్టు ప్రాంతాలు జలమయం

వేసవి తాపం నుంచి ఉపశమం 

 

పాడేరురూరల్‌/గూడెంకొత్తవీధి/చింతపల్లి/సీలేరు, ఏప్రిల్‌ 13: ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం చెందారు. పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులుతో వర్షం పడింది. పాడేరులో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 2.30 గంటల వరకు కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై బురద, కంకర చేరడంతో పాదచారులు ఇబ్బంది పడ్డారు. జి.మాడుగుల సమీపంలో కొండపై పిడుగులు పడడంతో మండల కేంద్రంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, సీలేరు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం  పడడంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతుగెడ్డ వారపు సంతలో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు.  కాగా గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుండడంతో ఖరీఫ్‌ పనులకు రైతులు సన్నద్ధం అవుతున్నారు.


అరకులోయ నియోజకవర్గంలో...

హుకుంపేట/ ముంచంగిపుట్టు/ డుంబ్రిగుడ, ఏప్రిల్‌ 13: అరకులోయ నియోజకవర్గం పరిధిలోని డుంబ్రిగుడ, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీక్షణంగా కాసింది. తర్వాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. హుకుంపేటలో సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంట పొలాలు నీటితో నిండిపోయాయి. ముంచంగిపుట్టులో రహదారులు చిత్తడిగా మారాయి. రోడ్లపై గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం చెందారు.


కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం, లింగపేట, గొలుగొండ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండతీవ్రతో ఇబ్బంది పడిన జనం... ఊరట చెందారు. 


Updated Date - 2021-04-14T05:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising