ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోమ్‌ క్యారంటైన్‌లో ఉన్నవారికి ఉచితంగా ఆహారం సరఫరా

ABN, First Publish Date - 2021-04-29T05:15:52+05:30

: కరోనా వైరస్‌ సోకి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న నిరుపేద కుటుంబాలకు శ్రీనగర్‌కు చెందిన జ్యోతి మహిళా సేవాసంఘం సభ్యులు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు

ఫుడ్‌ ప్యాకింగ్‌ చేస్తున్న జ్యోతి మహిళా సేవాసంఘం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 : కరోనా వైరస్‌ సోకి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న నిరుపేద కుటుంబాలకు శ్రీనగర్‌కు చెందిన జ్యోతి మహిళా సేవాసంఘం సభ్యులు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఎస్‌వీ మీడియా సభ్యుల సహకారంతో వీరు ఈ కార్యక్రమం చేపట్టారు.  ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను వారి ఇళ్ల వద్దకే  అందజేస్తున్నారు. మహిళా సంఘం సభ్యులు వంటలు చేసి, వాటిని ప్యాకింగ్‌ చేస్తే ఎస్‌వీ మీడియా సభ్యులు బైక్‌లపై వెళ్లి ఈ టిఫిన్‌, ఆహార పొట్లాలను బాధితులకు అందజేస్తున్నారు. తమకు ఆహారం కావాలని బాధితులు 7093853352 నంబరుకు ఫోన్‌ చేస్తే హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నంత కాలం  మూడు పూటలా ఆహారం అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. తాము ప్రస్తుతం 70 మందికి ఆహారం సరఫరా చేస్తున్నామని  సంఘం అధ్యక్షురాలు కొసిరెడ్డి లక్ష్మి, కార్యదర్శి సండ్రాన దేవి, సంయుక్త కార్యదర్శి కల్పన తెలిపారు. కరోనా బాధితులకు సేవలు అందించడం సంతృప్తిగా ఉందని ఎస్‌వీ మీడియా ప్రతినిధులు కె.గణేష్‌, పృథ్విలు తెలిపారు. 


Updated Date - 2021-04-29T05:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising