ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడేరులో దుకాణాల వద్ద పెరుగుతున్న రద్దీ

ABN, First Publish Date - 2021-05-09T04:54:36+05:30

పట్టణంలో దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరుస్తుండడంతో కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

మద్యం దుకాణం వద్ద కిటకిట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాడేరురూరల్‌, మే 8: పట్టణంలో దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరుస్తుండడంతో కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈసందర్భంగా అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కొవిడ్‌ నిబంధ నలు పాటించడం లేదు.  పట్టణంలోని కొన్ని షాపుల వద్ద, మద్యం షాపులు, పెట్రోలు బంక్‌ల వద్ద కొనుగోలుదారులు బారులు తీరడం, హడావిడి ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి కర్ఫ్యూ విధించినప్పటికి షాపుల వద్ద వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. కచ్చితంగా మధ్యా హ్నం 12 అయ్యే సరికి పోలీసులు రోడ్డెక్కి వాహనదారులు, షాపుల యజమానులపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎవరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. పోలీస్‌లు ట్రాఫిక్‌ నియంత్రణపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

సమయానికి రాని బస్సులు

సమయానికి తిరగని బస్సులతో గిరిజనులకు  అవస్థలు తప్పడం లేదు. వివిధ ప్రాంతాల్లో పనులకు వెళ్లిన కూలీలు తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు. మైదాన ప్రాంతం నుంచి పాడేరుకు మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత బస్సులు చేరుకోవడంతో అక్కడ నుంచి వివిధ మండలాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, వలసకూలీలు గమ్యం చేరలేక అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో చంటిపిల్లలు, లగేజీలతో నానా అవస్థలు పడుతూ నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళుతున్నారు.

Updated Date - 2021-05-09T04:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising