ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 3 రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

ABN, First Publish Date - 2021-07-23T04:42:54+05:30

గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని గిరిజన సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన సంఘం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్‌

విశాఖపట్నం, జూలై 22: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని గిరిజన సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీవో నంబరు 3 ద్వారా ఆదివాసీలు గడచిన ముప్పై ఏళ్ల నుంచి నూరు శాతం రిజర్వేషన్‌ పొందుతున్నారని, అటువంటి జీవోను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు.


గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  జీవో నంబరు 3 రిజర్వేషన్లపై తాము జారీ చేసిన మెమోను  వెంటనే ఉపసంహరిస్తూ టీఏసీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలకు ప్రత్యేక జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలన్నారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, బౌండ తౌడన్న, కె.సత్యనారాయణ, కె.శోభన్‌కుమార్‌, కరుణాకర్‌, అప్పలనర్సింహం, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-07-23T04:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising