ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని ఢిల్లీ నుంచి విశాఖకు.. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరాల్సి ఉండగా..

ABN, First Publish Date - 2021-08-10T06:09:31+05:30

కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని ఎన్నో ఆశలు, ఊహలతో ఢిల్లీ నుంచి ...

మృతుడు శ్రీరాములు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైలు ప్రమాదంలో ఆర్మీ సిపాయి మృతి
  • రెండు రోజుల్లో 11వ తేదీన వివాహ వార్షికోత్సం
  • కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా..
  • గడిపేందుకని వస్తుండగా లైనుకొత్తూరు వద్ద దుర్ఘటన

ఎలమంచిలి, ఆగస్టు 9: కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని ఎన్నో ఆశలు, ఊహలతో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఓ ఆర్మీ ఉద్యోగి రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి మృత్యువు పాలయ్యాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరతానన్న ఆనందంలో వున్న అతను...ఊహించని రీతిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎలమంచిలి మండలం లైనుకొత్తూరు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తుని రైల్వే ఎస్‌ఐ షేక్‌అబ్దుల్‌ మారూఫ్‌, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధి పెదపల్లికి చెందిన దంట్ల శ్రీరాములు (29) సుమారు పదేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలోని ఆర్మీ యూనిట్‌లో సిపాయిగా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం కల్యాణితో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఏడాదిన్నర కుమార్తె ఉంది. భార్య, కుమార్తె పెదపల్లిలో మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. శ్రీరాములు సెలవు లభించినప్పుడు సొంతూరు వస్తుంటాడు. ఆగస్టు 11వ తేదీన వివాహ వార్షికోత్సవం కావడంతో భార్య, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులతో గడపడానికి విధులకు సెలవు పెట్టి, శనివారం అర్ధరాత్రి ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. ఈ రైలు సోమవారం అర్ధరాత్రి 2.15 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తనను పికప్‌ చేసుకోవడానికి అనకాపల్లి స్టేషన్‌కు రావాలని తమ్ముడు గణేశ్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో అతను బైక్‌పై అనకాపల్లి స్టేషన్‌కు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత రైలు వచ్చింది. కానీ శ్రీరాములు దిగలేదు.


రైలు తిరిగి బయలులేరిన తరువాత కూడా కనిపించకపోవడంతో గణేశ్‌ వెంటనే శ్రీరాములు సెల్‌కు ఫోన్‌ చేశాడు. స్విచ్ఛాఫ్‌ అని రావడంతో ఆందోళన చెందాడు. వెంటనే ఇంటికి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పాడు. గణేశ్‌ హుటాహుటిన ఎలమంచిలి చేరకుని, కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే ట్రాక్‌పై గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఎలమంచిలికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో లైనుకొత్తూరు వద్ద రైల్వే ట్రాక్‌ పక్కన శ్రీరాములు మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై రైల్వే ఎస్‌ఐ మారూఫ్‌ మాట్లాడుతూ, రైలు బోగీ డోర్‌ వద్దకు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తూ జారిపడి కిందపడి వుండవచ్చునని అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2021-08-10T06:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising