ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర సామాజికవర్గాన్ని బీసీ-ఏలో చేర్చాలి

ABN, First Publish Date - 2021-10-22T06:30:55+05:30

వెనుకబడిన గవర సామాజికవర్గాన్ని బీసీ-ఏలోకి మార్పు చేయాలని గవర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ  ప్రసాద్‌


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 21: వెనుకబడిన గవర సామాజికవర్గాన్ని బీసీ-ఏలోకి మార్పు చేయాలని గవర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో కార్పొరేషన్‌ కార్యవర్గం తీర్మానం చేసినట్టు చెప్పారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 29న విశాఖ వస్తున్న బీసీ కమిషన్‌కు కార్పొరేషన్‌ చేసిన తీర్మానం లేఖను ఎంపీ డాక్టర్‌ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే విశాఖ కేంద్రంగా గవర జాతీయులకు ఎకరా స్థలం కేటాయించాలని, అనకాపల్లిలో 50 సెంట్లు స్థలం మంజూరు చేయించాలని తీర్మానంలో కోరామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఆడారి రుక్ష్మిణి, మొల్లేటి సరస్వతి, సూరిశెట్టి సుబ్బలక్ష్మి, శిలపరశెట్టి బాబి, బొడ్డేడ సూర్యనారాయణ, కొణతాల ఉమాదేవి, కె.వెంకటనరసింహం, మారిశెట్టి గంగాభాయి, దాడి జగన్నాథరావు, దాడి అప్పారావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising