ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త కదలదు.. మురుగు పారదు!

ABN, First Publish Date - 2021-06-24T05:48:24+05:30

మండలంలోని కొత్తూరు పంచాయతీ కేంద్రంలో చెత్త సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

కూరగాయల దుకాణం పక్కన చెత్త కుప్పలపై పందుల సంచారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూరు మేజరు పంచాయతీలో క్షీణించిన పారిశుధ్యం

ఎక్కడికక్కడే చెత్తచెదారం

కాలువల్లో పేరుకుపోయిన సిల్టు

పందులతో వాతావరణం కలుషితం

వ్యాధుల భయంతో వణుకుతున్న జనం

పట్టించుకోని అధికారులు, పాలకులు


కొత్తూరు, జూన్‌ 23: మేజరు పంచాయతీ కొత్తూరులో అడుగుపెడితే చెత్త వాతావరణం స్వాగతం పలుకుతోంది. పారిశుధ్య నిర్వహణ లోపించడంతో ఎక్కడికక్కడే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. కాలువల్లో సిల్టు తీయక మురుగు పేరుకుపోయింది. దీంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. 

మండలంలోని కొత్తూరు పంచాయతీ కేంద్రంలో చెత్త సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రెండు రోజులకోసారి ప్రతి వీధిలో చెత్తను తొలగించాల్సి ఉండగా, నెలలు తరబడి ఈ పని చేయకపోవడంతో సమస్య జఠిలమవుతోంది. పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


కాలువల నిర్వహణలో విఫలం

శారదానగర్‌లో రోడ్డుకురువైపులా కాలువలు లేవు. దీంతో వర్షం వచ్చినప్పుడు మురుగునీరు వీధుల్లోనే నిలిచిపోతోంది. ప్రధాన రహదారిలో ఉన్న పెద్ద కాలువలు పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో మురుగు పారడం లేదు. వర్షం వస్తే ఆ నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో ప్రధాన రహదారిలోకి వెళ్లాలంటేనే భయమేస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


దుకాణాల పక్కనే చెత్త కుప్పలు

పంచాయతీలోని దుకాణాల పక్కనే చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. వీటిని రోజులు తరబడి తొలగించకపోవడంతో కుళ్లిపోయి భరించలేని వాసన వస్తోంది. అసలే కరోనా భయంతో అల్లాడుతన్న ప్రజలు ఈ దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో అక్కడికి వచ్చిన కొనుగోలుదారులు వ్యాధుల భయంతో వణుకుతున్నారు. 



పందులు స్వైరవిహారం

కొత్తూరులో పందుల పంచారం ఎక్కువైంది. మురికి కాలువలు, చెత్త కుప్పల్లో స్వైరవిహారం చేస్తుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రజారోగ్యంపై పంచాయతీ అధికారులకు లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీలో పారిశుధ్యం మెరుగుపరచాలని, పందులను నియంత్రిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-06-24T05:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising