ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలోనే ఆందోళనలో పడి‘నారు’!

ABN, First Publish Date - 2021-08-02T06:15:17+05:30

ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్న అన్నదాతల్లో ఆదిలోనే అలజడి మొదలైంది.

గొలుగొండ మండలం కొత్తూరులో నారుకు మోటారు ద్వారా తడులు అందించేందుకు రైతుల ప్రయత్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ముఖం చాటేసిన వరుణుడు 

తడులు లేక ఎండిపోతున్న మడులు

 కొన్నిచోట్ల పాముపొడ తెగులు 

అయోమయంలో అన్నదాతలు

గొలుగొండ/కృష్ణాదేవిపేట/ మాక వరపాలెం, ఆగస్టు 1 : ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్న అన్నదాతల్లో ఆదిలోనే అలజడి మొదలైంది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న నారు మడులు,  మరో వైపు తెగుళ్ల బెడద వెరసి మున్ముందు పంటల పరిస్థితి ఏమిటన్న అయోమయంలో పడ్డారు. సీజన్‌ ఆరంభానికి ముందు అడపా దడపా వర్షాలు కురవడంతో గంపెడా శతో వ్యవసాయ పనులకు సిద్ధమ య్యారు. ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో పదును కోసం ఆకాశం వంక ఆశగా ఎదురు చూస్తు న్నారు.  గొలుగొండ మండలంలోని గొలు గొండ కొత్తమల్లంపేట, జి.కొత్తూరు, గుం డుపాల, పాతమల్లంపేట, పాకలపాడు, చీడిగుమ్మల, ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవి పేట, చోద్యం తదితర గ్రామాల్లో గత నెల తొలివారంలో వర్షాలు పడడంతో వరి విత్తనాలు నాటారు. రెండు వారాలుగా సరైన వానలు లేకపోవడంతో నారు మడులు ఎండిపోతున్నాయని  వాపోతున్నారు. దీంతో కొందరు గెడ్డలు, బోరుబావులను నుంచి నీటిని తోడి ఆకుమడులకు తడులు అందిస్తున్నారు. మరో పదిరోజుల్లో వర్షాలు కురవకపోతే ౖ ఆశలు వదులు కోవాల్సిందేనని చెపుతు న్నారు.  రావణాపల్లి రిజర్వాయర్‌ కింద గల ఆయకట్టుకు నీటిని అందించాలని ఆయా రైతులు కోరుతున్నారు.

తెగుళ్ళతో.. రైతులు దిగులు

ఇదిలావుంటే, మాకవరపాలెం మండ లంలోని పలు గ్రామాల్లో వరినారుకు తెగుళ్లు సోకడంతో రైతులు లబోది బోమంటున్నారు. ఇప్పటికే నాట్లు వేసేందుకు దమ్ములను సిద్ధం చేస్తున్న తరుణంలో తెగుళ్లు సోకడంతో నివారణ చర్య లకు సూచనల కోసం వ్యవసాయ కార్యా లయాల చుట్టూ ప్రదక్షిణలు చేసు ్తన్నారు. మాకవరపాలెం, తామరం, కొండలఅగ్రహారం, తూటిపాల, పాపయ్యపాలెం, పైడిపాల తదితర గ్రామాల్లో వరి నారుకు పాముపొడ తెగులుతో పాటు ఇనుముధాతు, జింకులోపం రావడంతో రైతులు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. 

Updated Date - 2021-08-02T06:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising