ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్లో మరిచిపోయిన వస్తువులు బాధితులకు అప్పగింత

ABN, First Publish Date - 2021-10-18T06:00:11+05:30

రైల్లో మరిచిపోయిన విలువైన వస్తువులను బాధితులకు అప్పగించిన రైల్వే రక్షణ దళం సిబ్బందిని డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ, సీనియర్‌ డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రఘువీర్‌ అభినందించారు.

విశాఖ ఆర్పీఎఫ్‌ స్టేషన్‌లో బాధితులకు బ్యాగ్‌ అప్పగిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆర్పీఎఫ్‌ సిబ్బందిని అభినందించిన డీఆర్‌ఎం

విశాఖపట్నం, అక్టోబరు 17: రైల్లో మరిచిపోయిన విలువైన వస్తువులను బాధితులకు అప్పగించిన రైల్వే రక్షణ దళం సిబ్బందిని డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ, సీనియర్‌ డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రఘువీర్‌ అభినందించారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం విజయనగరానికి చెందిన సాలగ్రామ నామని అనే ప్రయాణికుడు పాట్నా-ఎర్నాకులం (02644) ఎక్స్‌ప్రెస్‌ ఏ1 కోచ్‌లో ప్రయాణించి తన వెంట తీసుకువచ్చిన సుమారు రూ.1.05 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదుతో కూడిన బ్యాగ్‌ను ఆదమరుపులో రైల్లో విడిచిపెట్టి విజయనగరం స్టేషన్‌లో దిగిపోయాడు. రైలు కదిలిపోయిన తర్వాత బ్యాగ్‌ను విడిచిపెట్టినట్టు గుర్తుకు వచ్చి ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడ నుంచి విశాఖ ఆర్పీఎఫ్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది పాట్నా-ఎర్నాకులం రైలు విశాఖ స్టేషన్‌కు చేరిన వెంటనే ఏ1 కోచ్‌లోకి వెళ్లి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకుని విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బాధితులను ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రాథమిక విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించి బ్యాగ్‌ను అప్పగించారు. మరో ఘటనలో రాజమండ్రికి చెందిన ఎం.శివదుర్గ అనే ప్రయాణికుడు కృష్ణరాజపురం-భువనేశ్వర్‌ హంసఫర్‌ (02886) ఎక్స్‌ప్రెస్‌ బీ-13 కోచ్‌లో ప్రయాణించి రూ.లక్ష 30 వేలు విలువైన రెండు ల్యాప్‌టాప్‌లను రైల్లో విడిచిపెట్టి రాజమండ్రి స్టేషన్‌లో దిగిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు దువ్వాడ ఆర్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై ఆ రైలు దువ్వాడ చేరిన వెంటనే కోచ్‌లోకి ప్రవేశించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితునికి అప్పగించారు. 


Updated Date - 2021-10-18T06:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising