ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్రోణంరాజు కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

ABN, First Publish Date - 2021-02-06T06:23:18+05:30

విశాఖనగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో స్టార్‌ ఫ్లెక్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిర్వహిస్తున్న ‘ద్రోణంరాజు శ్రీనివాస్‌ స్మారక 9ఏ సైడ్‌ ఫుట్‌బాల్‌’ పోటీలు సెమీఫైనల్‌ దశకు చేరుకున్నాయి.

పోటీలకు ముందు ఆటగాళ్లను పరిచయం చేసుకుంటున్న అతిథులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెమీస్‌కు నాలుగు జట్లు

 విశాఖపట్నం (స్పోర్ట్సు), ఫిబ్రవరి 5: విశాఖనగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో స్టార్‌ ఫ్లెక్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిర్వహిస్తున్న ‘ద్రోణంరాజు శ్రీనివాస్‌ స్మారక 9ఏ సైడ్‌ ఫుట్‌బాల్‌’ పోటీలు సెమీఫైనల్‌ దశకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్స్‌లో మహముద్దీన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ 5-4 గోల్స్‌ తేడాతో ఎంఎంఎఫ్‌సీపై, మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీసీఎఫ్‌ఏ 5-4 గోల్స్‌ తేడాతో డాన్‌ మెమోరియల్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరాయి.


మరో గ్రూప్‌లోని తొలి క్వార్టర్‌లో శబరి స్పోర్టింగ్‌ క్లబ్‌ 2-0 గోల్స్‌తో విజ్జీస్‌ అకాడమీ గెలుపొందింది. శబరి క్లబ్‌లో ఎం.శ్రీహరి రెండు గోల్స్‌చేసి జట్టుకు విజయాన్నందించాడు. చివరి మ్యాచ్‌లో పోలమాంబ ఎస్‌సీ 3-1 గోల్స్‌ తేడాతో బ్లూ స్టార్‌పై గెలుపొందింది. పోలమాంబ జట్టులో ప్రసాద్‌ రెండు, ఎం.శ్రీను ఒక గోల్‌ సాధించారు.


శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జీహెచ్‌ఎంసీ రిటైర్డ్‌ అడిషినల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఫుట్‌బాలర్‌ ప్రసాదరావు (నందు), కొండలరావు, ఎస్‌జీ.రామకృష్ణ, వై.శ్రీనివాసరావు, రమణయ్య, టోర్నీ నిర్వాహకులు త్రినాధరావు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T06:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising