ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు

ABN, First Publish Date - 2021-12-03T06:12:51+05:30

తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు.

మత్ప్యకారులకు తుఫాన్‌ గురించి వివరిస్తున్న ఎస్‌ఐ ప్రసాదరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు విస్తృత ప్రచారం

పాయకరావుపేట రూరల్‌, డిసెంబరు 2 : తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. మండలంలోని పాల్మన్‌పేట, వెంకటనగరం, పెంటకోట తదితర తీరప్రాంత గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి, మత్స్యకారులను అప్రమత్తం చేశారు.  లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వలలు, పడవలను జాగ్రత్త చేసుకోవాలని సూచిం చారు. అలాగే, పాడిబడిన ఇళ్లలో ఉన్నవారు ఖాళీ చేయాలన్నారు. వర్షాలకు ఇటువంటి ఇళ్ల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తించాలన్నారు.

Updated Date - 2021-12-03T06:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising