ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద సేవకు ముందుండాలి

ABN, First Publish Date - 2021-03-02T05:50:17+05:30

పౌర రక్షణ అందరి బాధ్యత అని, శిక్షణ పొందిన వలంటీర్లు ప్రకృతి వైపరీతాయల సమయంలో స్వచ్ఛందంగా సేవలందించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.వి.ఎస్‌.రామ్‌ప్రకాష్‌ తెలిపారు.

వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్న జిల్లా అగ్నిమాపక అధికారి రామ్‌ప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.వి.ఎస్‌.రామ్‌ప్రకాష్‌ 

సీతంపేట, మార్చి 1: పౌర రక్షణ అందరి బాధ్యత అని, శిక్షణ పొందిన వలంటీర్లు ప్రకృతి వైపరీతాయల సమయంలో స్వచ్ఛందంగా సేవలందించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.వి.ఎస్‌.రామ్‌ప్రకాష్‌ తెలిపారు. గురుద్వార కూడలి శాంతిపురంలో గల పౌర రక్షణ సంస్థలో 221వ బ్యాచ్‌ వలంటీర్ల శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.


కార్యక్రమానికి హాజరైన రామ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులను నిర్విరామంగా నిర్వహిస్తున్న ఉప పౌరరక్షణ అధికారి, ప్రత్యేక ఉపకలెక్టర్‌ కె.భవాని, విశేష సేవలు అందిస్తున్న రిటైర్డు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.రామారావును, ఇతర శాఖల అధికారులను, సిబ్బంది కృషిని అభినందించారు.కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన వలంటీర్లు మాక్‌డ్రిల్‌ ప్రదర్శించి తమ నైపుణ్యాలు చాటుకున్నారు. ప్రమాద సమయంలో ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించడాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు.


అనంతరం శిక్షణ పొందిన వలంటీర్లకు ముఖ్య అతిథి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉప పౌర రక్షణ అధికారి భవాని మాట్లాడుతూ 221వ బ్యాచ్‌లో 39 మంది శిక్షణ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అగ్నిమాపన సిబ్బంది, పోలీసు కమ్యూనికేషన్‌ శాఖ సిబ్బంది, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising