ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెల్లో జ్వరాల విజృంభణ

ABN, First Publish Date - 2021-10-25T06:07:19+05:30

మండలంలోని పలు గ్రామాలను జ్వరాలు వణికిస్తున్నాయి. నాతవరం, సరుగుడు గ్రామాల్లో ఎక్కువగా జ్వరపీడితులు కనిపిస్తున్నారు.

నాతవరం ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరాలతో చికిత్సలు పొందుతున్న రోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  నాతవరంలో సుమారు 70 మంది, సరుగుడులో 50 మంది వరకు జ్వరపీడితులు

 క్షీణించిన పారిశుధ్యం, వాతావరణంలో మార్పులతో పలువురికి అనారోగ్యం

  ప్రభుత్వ ఆస్పత్రిలో సరిగా  వైద్య సేవలు అందడం లేదని ఆవేదన

 ఉన్నతాధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వేడుకోలు


నాతవరం, అక్టోబరు 24 : మండలంలోని పలు గ్రామాలను జ్వరాలు వణికిస్తున్నాయి. నాతవరం, సరుగుడు గ్రామాల్లో ఎక్కువగా జ్వరపీడితులు కనిపిస్తున్నారు. పలుచోట్ల క్షీణించిన పారిశుధ్యం, వాతావరణంలో మార్పుల కారణంగా పలువురు అనారోగ్యాలకు గువుతున్నారు. నాతవరంలో దాదాపు 70 మంది వరకు జ్వరాలతో బాధప డు తున్నట్టు తెలిసింది. ఎస్సీ, బీసీ కాలనీల్లో చాలా మంది జ్వరాలతో మం చంపై మూలుగుతున్నారు. ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోందని వాపో తున్నారు. ఈ ఆస్పత్రిలో మందుల కొరత లేనప్పటికీ ఉన్న ఇద్దరు వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతున్నట్టు పలువురు తెలిపారు. దీంతో ఉదయం వేళ విధులకు ఆల స్యంగా రావడం, సాయంత్రం త్వరగా ఆస్పత్రి నుంచి వెళ్లడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా వుంటే, జ్వరా లతో  ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లి పరీ క్షలు చేయించుకుంటే డెంగ్యూ, మలేరియా చెపుతున్నారని, దీనికి భయ పడి  ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొం దుతున్నామన్నారు.  కొందరు విశాఖపట్నం ఆస్పత్రులకు కూడా పరు గులు తీస్తున్నారు. ఇక గిరిజన గ్రామమైన సరుగుడులోనూ దాదాపు 50 మంది వరకు జ్వరపీడితులు ఉన్నారని సమా చారం. వీరిలో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక ప్రభుత్వ ఆస్ప త్రిలో ఇచ్చిన మం దులతోనే సరిపెట్టు కుంటున్నారు.  మరికొందరు అప్పులు చేసి మరీ నాతవరంలోని ప్రైవేటు ఆస్ప త్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. జిల్లా వైద్యాధికారులు తక్షణమే స్పందించి  జ్వరాల అదుపునకు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని   కోరుతున్నారు. అలాగే, పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-10-25T06:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising