ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ చెరువులో మళ్లీ తవ్వకాలు

ABN, First Publish Date - 2021-05-06T04:19:12+05:30

మండలంలోని పెదగాడి అమ్మ చెరువులో అనధికార, అక్రమ మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఎక్సకవేటర్ల సాయంతో రాత్రింబవళ్లు మట్టి తవ్వకాలు చేపట్టి, లారీలతో మట్టిని తరలించే పనులు సాగిపోతున్నాయి.

చెరువులో ఎక్సకవేటరు, లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తిరూరల్‌, మే 5: మండలంలోని పెదగాడి అమ్మ చెరువులో అనధికార, అక్రమ మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఎక్సకవేటర్ల  సాయంతో  రాత్రింబవళ్లు మట్టి తవ్వకాలు చేపట్టి, లారీలతో మట్టిని తరలించే పనులు  సాగిపోతున్నాయి. సర్వేనెంబరు 48 పెదగాడి అమ్మ చెరువు విస్తీరణం 53 ఎకరాలు. దీని కింద సుమారు 200 ఎకరాల  ఆయుకట్టు  ఉంది. చెరువులో మట్టి పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులు కన్నేశారు. రెండు వారల కిందట ఎక్సకవేటరును     తీసుకొచ్చి తవ్వకాలు చేపడుతున్నారు.  దీనిపై ‘మట్టినీ మింగేస్తున్నారు’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో తవ్వకాలు నిలిపివేశారు.  తాజాగా మళ్లీ ప్రారంభించి విజయనగరం జిల్లా చింతలపాలెం ప్రాంతంలో గల ఓ ప్రైవేట్‌ లేఅవుట్‌కు తరలించేస్తున్నారని, అధికారులకు తెలిసే ఈ తతంగం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  దీనిపై ఆర్డీవో, తహసీల్దార్‌, జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మాజీ సర్పంచి బొడ్డు అప్పలరాజు వాపోయారు.

Updated Date - 2021-05-06T04:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising