ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సర్వం సిద్ధం చేయాలి

ABN, First Publish Date - 2021-01-26T06:10:14+05:30

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021కు సర్వం సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ కమిషనర్‌ సృజన 

సిరిపురం, జనవరి 25: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021కు సర్వం సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జీవీఎంసీ ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడుతూ స్మార్ట్‌సిటీలో భాగంగా రోడ్లకు ఇరువైపులా తవ్వి చేపడుతున్న పనులు పూర్తయిన అక్కడి డెబ్రిస్‌ను తీయించాలని, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి కాలువలు శుభ్రంగా ఉండేలా చూడాలని సీఎంవోహెచ్‌ అధికారులకు సూచించారు. హోమ్‌ కంపోస్ట్‌పై మహిళల్లో అవగాహన పెంచి కనీసం 50 వేల ఇళ్లల్లో హోమ్‌ కంపోస్టు తయారీకి చర్యలు చేపట్టాలన్నారు. ఫీడ్‌బ్యాక్‌ విషయంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 అడిగిన ప్రశ్నలకు పాజిటివ్‌గా సమాధానాలు వచ్చేలా చూడాలని పీడీ వై.శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీలు ఆశాజ్యోతి, సన్యాసిరావు, ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, సీసీపీ విద్యుల్లత, సీఎంవోహెచ్‌ శాస్ర్తి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T06:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising