ఉద్యోగులు రేషన్ కార్డులను సరెండర్ చేయాలి
ABN, First Publish Date - 2021-09-08T04:16:50+05:30
రేషన్ కార్డులు కలిగి ఉన్న ఉద్యోగులంతా వెంటనే వాటిని సరెండర్ చేయాలని జేసీ వేణుగోపాలరెడ్డి ఆదేశించారు.
లబ్ధిదారుల జాబితా ప్రదర్శనపై జేసీ అసంతృప్తి
సబ్బవరం, సెప్టెంబరు 7 : రేషన్ కార్డులు కలిగి ఉన్న ఉద్యోగులంతా వెంటనే వాటిని సరెండర్ చేయాలని జేసీ వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. మండలంలోని మలునాయుడుపాలెం, సబ్బవరం-2 సచివాలయాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిరెడ్డిపాలెం సచివాలయంలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఉన్న ఉద్యోగులు వాటిని సరెండర్ చేయకుండా సిబ్బందిని ఇబ్బంది పెడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిరెడ్డిపాలెం గ్రామంలో గత 18 నెలలుగా 1060 మందికి వివిధ రకాల సేవలు అందించినట్టు గుర్తించారు. మలునాయుడు పాలెం సచివాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్‌పై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ ప్రజలకు సకాలంలో సేవలు అందించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులం దరికీ ప్రభుత్వం పథకాలు అందాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రమాదేవి, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌టీ రామకాసు, కార్యదర్శి మహాలక్ష్మీనాయుడు, సచివాలయాల సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2021-09-08T04:16:50+05:30 IST