ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్నికల విధులపై అలసత్వం వద్దు’

ABN, First Publish Date - 2021-03-02T06:32:46+05:30

మునిసిపల్‌ ఎన్నికల విధుల పట్ల అలసత్వం ప్రదర్శించ వద్దని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు.

సిబ్బందికి సూచనలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం, మార్చి 1 : మునిసిపల్‌ ఎన్నికల విధుల పట్ల అలసత్వం ప్రదర్శించ వద్దని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న భవనంలో ఎన్నికల అధికారులు, సహాయ, అదనపు ఎన్నికల అధికారులకు ఏర్పాటైన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడాల న్నారు.  నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ఉదయం 11గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుల చేయడంతో పాటు స్వంతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరగాలన్నారు. బ్యాలెట్‌ పేపర్లు ప్రింటింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.ఎనకారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, జీవీఎంసీ ఎన్నికల్లో విధులకు సంబంధించి పీవోలు, ఏపీవోలకు పెదబొడ్డేపల్లి ఎస్‌వీఎస్‌ ఫంక్షన్‌ హాల్లో శిక్షణ ఇచ్చారు. మాస్టర్‌ ట్రైనర్స్‌ సీహెచ్‌.సత్యనారాయణ, పట్నాయక్‌, ఐవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T06:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising