ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎల్‌పురంలో చిన్నారిని కాటేసి.. కుక్క మృతి!

ABN, First Publish Date - 2021-01-19T06:16:49+05:30

ఇక్కడి సీహెచ్‌సీలో చిల్డ్రన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ గ్లోరీ తబిత చొరవతో ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది.

కుక్క కాటుకు గురైన బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నక్కపల్లి ఆస్పత్రికి తరలించిన తల్లిదండ్రులు 

 ప్రత్యేక చికిత్సతో తప్పిన ప్రమాదం

నక్కపల్లి, జనవరి 18 : ఇక్కడి సీహెచ్‌సీలో చిల్డ్రన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ గ్లోరీ తబిత చొరవతో ఓ చిన్నారి  ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఎస్‌.రాయవరం మండలం లక్ష్మీపతిరాజుపేటకు చెందిన పి.మంగలక్ష్మి తన కుటుంబంతో కలిసి ఇటీవల నక్కపల్లి మండలం డీఎల్‌పురంలో వున్న పుట్టింటికి వచ్చింది. సోమవారం ఆమె కుమార్తె పి.దివ్యశ్రీ (4)కి వీధి కుక్క చేతిపై కాటు వేసింది. ఆ తరువాత ఆ కుక్క చనిపోవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వెంటనే ఆ బాలికను నక్కపల్లి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. సాధారణంగా ఇక్కడ కుక్కకాటుకు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ మాత్రమే వేస్తారు. అయితే, ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్‌ గ్లోరీ తబిత ఏఆర్‌వీ వ్యాక్సిన్‌తో పాటు యాంటీ ర్యాబిస్‌ ఇమ్యునో గ్లోబిలెన్స్‌ సీరం ఇంజక్షన్‌ కూడా వేయడంతో ఆ బాలికకు ప్రమాదం తప్పిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జనార్దనం తెలిపారు. 

Updated Date - 2021-01-19T06:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising