ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీడీఏకు రూ.4.15 లక్షల విలువైన మందులు వితరణ

ABN, First Publish Date - 2021-06-23T05:48:49+05:30

స్థానిక ఐటీడీఏకు నర్సీపట్నం కేంద్రంగా పనిచేస్తున్న విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ రూ.4.15 లక్షల విలువైన మందులు, వైద్య ఉపకరణాలను వితరణగా అందించింది.

స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన మందులను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు, జూన్‌ 22: స్థానిక ఐటీడీఏకు నర్సీపట్నం కేంద్రంగా పనిచేస్తున్న  విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ రూ.4.15 లక్షల విలువైన మందులు, వైద్య ఉపకరణాలను వితరణగా అందించింది. సంస్థ నిర్వాహకులు మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో గోపాలకృష్ణను కలిసి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా 2,500 సర్జికల్‌ గ్లౌజులు, 80 పల్స్‌ ఆక్సిమీటర్లు, 36 గ్లుకోమీటర్లు, 550 డిస్పోజిబుల్‌ బెడ్‌ షీట్లు, 200 ప్లాస్టిక్‌ ఫేస్‌ మాస్క్‌లు, 20 డస్ట్‌బిన్లు, విటమిన్‌ సీ, డాక్సిసైక్లిన్‌ మాత్రలతో కలిపి మొత్తం 14 రకాల మందులు, పలు రకాల వైద్య పరికరాలు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన అర్గ్యం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతోనే వీటిని సమకూర్చామని వీజేఎన్‌ఎన్‌ఎస్‌ డైరెక్టర్లు తెలిపారు. ఈసందర్భంగా సంస్థ  డైరెక్టర్లు ఎ.శివకుమార్‌, ఆర్‌.రాజగోపాల్‌, సెక్రటరీ ఏవీ.రఘురామ్‌లను ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, సంస్థ మేనేజర్లు రవికుమార్‌, చిట్టిబాబు, సన్యాసిరావు, గణేష్‌, ఎస్‌పీ. నాయుడు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-23T05:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising