ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల తొలగింపు అన్యాయం

ABN, First Publish Date - 2021-01-21T04:56:55+05:30

జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్న 60 ఏళ్లు నిండిన పారిశుధ్య కార్మికులకు ఎటువంటి హామీ ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు 

సిరిపురం, జనవరి 20: జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్న 60 ఏళ్లు నిండిన పారిశుధ్య కార్మికులకు ఎటువంటి హామీ ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారి తొలగింపును నిరసిస్తూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా బుధవారం నుంచి అరవై ఏళ్లు నిండిన కార్మికులను తొలగించడం భావ్యం కాదన్నారు. కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని, అరవై ఏళ్లు నిండాయని తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అమ్మఒడి పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.వెంకట్‌రెడ్డి, జి.సుబ్బారావు, ప్రసాద్‌, వెంకన్న, నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T04:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising