ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష అన్యాయం’

ABN, First Publish Date - 2021-07-25T06:03:00+05:30

సమాజంలో దళితుల పట్ల ఇప్పటికీ వివక్ష అన్యాయమని ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బోర్డు సభ్యుడు సోనిహుడ్‌ వాపోయారు.

సన్యాసిరాజుపాలెంలో మాట్లాడుతున్న ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యుడు సోని హుడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటవురట్ల/పాయకరావుపేటరూరల్‌, జూలై 24 : సమాజంలో దళితుల పట్ల ఇప్పటికీ వివక్ష అన్యాయమని ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బోర్డు సభ్యుడు సోనిహుడ్‌ వాపోయారు. కోటవురట్ల మండలంలోని సన్యాసిరాజుపాలెంలో ఇటీవల దళిత మహిళ రత్నంపై అగ్రవర్ణాలవారు దాడి చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటన సదస్సులో మాట్లాడుతూ దళితులపై దాడులు  సహించేది లేద న్నారు. ఈ ఘటనలపై పోలీసులు నిర్లక్ష్యం, పక్షపాతం చూపితే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా నన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మితో పాటు మూడు మండలాలకు చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, పాయకరావు పేట మండలం శ్రీరాంపురంలో పర్యటించారు. తొలుత తుని, పాయకరావుపేటలకు చెందిన పాస్టర్లతో కలిసి ఇక్కడ వివాదంలో ఉన్న చర్చి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ గ్రామంలో చర్చి నిర్మాణ స్థలం సమస్యను పరిష్కరించి, చర్చిని పునర్నిర్మాణానికి   కృషి చేస్తానని చెప్పారు. పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు  అల్లి ఆనంద్‌కుమార్‌, ఛార్టెస్‌ పిన్ని, మాజీ సర్పంచ్‌ గంగిరెడ్ల వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising