ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.80 లక్షల విలువైన బస్టాప్‌ కూల్చివేత

ABN, First Publish Date - 2021-10-22T05:47:53+05:30

రుషికొండలో గీతం యూనివర్సిటీ ఎదురుగా నిర్మించిన రూ.80 లక్షల విలువైన బస్టాప్‌ను పర్యాటక శాఖ కూల్చివేసింది.

బస్టాప్‌ను కూల్చివేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్యాటక శాఖ తీరుపై విమర్శలు

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రుషికొండలో గీతం యూనివర్సిటీ ఎదురుగా నిర్మించిన రూ.80 లక్షల విలువైన బస్టాప్‌ను పర్యాటక శాఖ కూల్చివేసింది. దీనిపై స్థానికులు, విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండలో హరిత కాటేజీలను కూల్చివేసి, ఆ కొండను చదునుచేసి ఫైవ్‌స్టార్‌ హోటల్‌ కడతామని పర్యాటక శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పనుల్లో భాగంగా బస్టాప్‌ను గురువారం కూల్చివేశారు. ఇక్కడ బస్టాప్‌ను సుమారుగా రోజుకు 20వేల మంది ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా గీతం కాలేజీకి బస్సుల్లో వచ్చే విద్యార్థులంతా ఇక్కడే బస్సుల కోసం వేచి ఉంటారు. గతంలో ఇక్కడ సరైన బస్టాప్‌ లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై ఎండలో నిలబడేవారు. ఆ మార్గాన వెళ్లే ఐటీ కంపెనీల యజమానులు ఈ విషయాన్ని నాటి వుడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రూ.80 లక్షలతో అన్ని వసతులతో బస్టాప్‌ను నిర్మించారు. ఇప్పుడు ఈ బస్టాప్‌ను  కూల్చివేయడంతో విద్యార్థులు మళ్లీ ఎండలో రోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-10-22T05:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising