ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాయిద్య పరికరాలకు గిరాకీ

ABN, First Publish Date - 2021-04-14T05:24:08+05:30

గిరిజనుల వివాహ వేడుకలు, శుభకార్యాల్లో మేళాతాళాల కోసం వినియోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలకు గిరాకీ పెరిగింది.

సంతలో వాయిద్య పరికరాలను విక్రయిస్తున్న వృత్తికారుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతలో అమ్మకానికి తెస్తున్న ఒడిశా వృత్తికారులు


పెదబయలు, ఏప్రిల్‌ 13: గిరిజనుల వివాహ వేడుకలు, శుభకార్యాల్లో మేళాతాళాల కోసం వినియోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలకు గిరాకీ పెరిగింది. ఆదివాసీల పండుగలు, ధింసా నృత్యాల్లో కూడా వీటిని వినియోగిస్తుంటారు. తుడుము డప్పులు, నరిగే డప్పులు, సోనాయ్‌ తదితర పేర్లతో పిలిచే వీటిని జంతు చర్మాలతో తయారు చేస్తారు. పెదబయలులో ప్రతి సోమవారం జరిగే సంతకు పక్కనే వున్న ఒడిశా నుంచి పలురకాల వాయిద్య పరికరాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. గతంలో ఎక్కువ మంది వీటిని తయారుచేసేవారు. కానీ ఆధునిక వాయిద్య పరికరాలు వచ్చిన తరువాత వీటికి గిరాకీ తగ్గింది. దీంతో చాలా మంది ఈ వృత్తికి స్వస్తి చెప్పారు. ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రమే ఈ వాయిద్య పరికరాలను సంతకు తీసుకువస్తున్నారు. దీంతో గిరాకీ పెరిగింది. శ్రమకు తగ్గిన ప్రతిఫలం లభిస్తున్నదని తయారీదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-04-14T05:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising