ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ ఆదేశాలు సక్రమంగా అమలు జరగడం లేదు

ABN, First Publish Date - 2021-05-06T05:15:59+05:30

కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో సరిగ్గా అమలు కావడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.

లేఖ చూపుతున్న వెలగపూడి రామకృష్ణబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌కు ఎమ్మెల్యే వెలగపూడి లేఖ

ఎంవీపీ కాలనీ, మే 5: కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో సరిగ్గా అమలు కావడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబుకు లేఖ రాశారు. కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుందన్నారు. నగరంలోని గ్యాస్‌ కంపెనీలకు తగిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా కాకపోవడంతో ఆయా కంపెనీలు జిల్లాలోని ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయలేకపోతున్నాయని, తద్వారా ఆక్సిజన్‌ బెడ్లు పెంచుకోలేక పోతున్నామన్నారు. అలాగే వ్యాక్సినేషన్‌ సరిగ్గా జరగడం లేదని, గంటల తరబడి ప్రజలు ఎండలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాక్సినేషన్‌ కేంద్రాలను పెంచాలని ఎమ్మెల్యే కోరారు. రెమిడెసీవర్‌ ఇంజక్షన్లు లభించక కొవిడ్‌ బాధితులు ఇబ్బందులు పడుతున్నందున వీటితో పాటు మరిన్ని ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-06T05:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising