ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులు, గిరిజనులకు ఉపాధి పనులు రద్దు చేసే కుట్ర

ABN, First Publish Date - 2021-06-22T05:41:39+05:30

రానున్న రోజుల్లో దళితులు, గిరిజనులకు ఉపాధి హామీ పనులను రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నదని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స విమర్శించారు.

చింతలవీధి ప్రాంతంలో ఉపాధికూలీలతో కలిసి నిరసన తెలుపుతున్నగిరిజన సంఘం నేత అప్పలనర్స
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స 

పాడేరు, జూన్‌ 21: రానున్న రోజుల్లో దళితులు, గిరిజనులకు ఉపాధి హామీ పనులను రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నదని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స విమర్శించారు. ఉపాధి పనుల్లో కుల విభజనకు నిరసనగా  చింతలవీధిలో ఉపాధి కూలీలతో కలిసి సోమవారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం దళితులు, గిరిజనులను ఉపాధి పనులకు దూరం చేయాలని లక్ష్యంతోనే కుల విభజనకు చేయాలని భావిస్తున్నారన్నారు. అందరికీ ఒకేలా ఉపాధి పనులు కల్పించాలని, కొవిడ్‌ నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు, 18 రకాల నిత్యావసర సరకులు ఉచితంగా అందించాలని అప్పలనర్స డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం నేత ఎల్‌.సుందరరావు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-22T05:41:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising