ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్ ‌ప్లాంట్‌ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-02-23T19:34:50+05:30

ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్  స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఉక్కు కర్మాగారంపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను బాధించాయని అన్నారు. ప్రతిపక్షాల విజ్ఞతకు వదిలేస్తున్నామని... పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంత అసమర్థ నాయకులను, పరిపాలనను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అమాయకంగా మొహం పెట్టి మాట్లాడితే ప్రజలు గుడ్డిగా నమ్ముతారనుకోవడం పొరపాటే అని అన్నారు. 7వేల ఎకరాలు అమ్మి ఫ్యాక్టరీలు పెడతామని ఉక్కు కర్మాగారంపై తమకున్న ప్రేమ కనిపిస్తూనే ఉందని మండిపడ్డారు. సంవత్సరం క్రితమే ఉక్కు కర్మాగారం అమ్మకానికి రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి తమ బట్టలూడదీసినట్టు విషయాన్ని చెప్పారని... అమాయకంగా నటిస్తే లాభం లేదన్నారు.


తమ ఎంపీలు ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను, కార్మికులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వెళ్తే అక్కడ చెబుతారు అమ్మేవాడేవడు, కొనేవాడేవడు అని అని ఆయన అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వెనుక కుట్ర పూరిత స్కాం ఉందని... దీన్ని ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను కాపాడలేని అసమర్థులని వ్యాఖ్యానించారు. తమరు బొమ్మల్లా చేతకాని వారిగా మిగిలిపోయారని విరుచుకుపడ్డారు. ‘‘మోదీ మన్ కి బాత్ లాగా మీరు ఉత్తరాలు కి బాత్ చేస్తుంటారు’’  లేఖ రాసామని అంటూ యెద్దేవా చేశారు. పార్లమెంట్ లోపల బయట వైసీపీ ఎంపీలు పోరాడాల్సిన అవసరం ఉందని... చూస్తాం చేస్తాం అని మాట్లాడితే కుదరదని అన్నారు. ఉక్కు కర్మాగారం 2 లక్షల కోట్లను ఇవ్వడానికి ఎంత తొందర పడుతున్నారో అర్ధమవుతుందని వ్యాఖ్యానించారు. అమాయకంగా మొహం పెట్టి ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడుతున్నారని ఆగ్రహించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-02-23T19:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising