ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్దు‘బడి’కి కసరత్తు పూర్తి

ABN, First Publish Date - 2021-10-25T06:09:00+05:30

మండలంలో ఆరు ప్రాథమిక పాఠశాలల్లో విద్య నభ్యసిస్తున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో గల ఉన్నత పాఠశాలలో విలీనం చేయ నున్నారు.

చెట్టుపల్లిలోని ఒకే ఆవరణలో ఉన్న జడ్పీ హైస్కూల్‌, ఎంపీపీ స్కూల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  

  ఆరు పాఠశాలల్లోని  3, 4, 5 తరగతుల విద్యార్థులు సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం

నర్సీపట్నం, అక్టోబరు 24 : మండలంలో ఆరు ప్రాథమిక పాఠశాలల్లో విద్య నభ్యసిస్తున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో గల ఉన్నత పాఠశాలలో విలీనం చేయ నున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలులోకి రానుంది. 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఒకే ఆరణలో, పక్క పక్కనే ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను హైస్కూళ్లలో విలీనం చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు  చెట్టుపల్లి ఎంపీపీ పాఠశా లలో పైమూడు తరగతులు చదువుతున్న 150 మంది విద్యార్థులను ఆదే ఆవరణలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలుపుతున్నారు. పెదబొడ్డేపల్లి ఎంపీపీ స్కూల్‌ విద్యార్థులు 174 మంది, నర్సీపట్నం ఎంపీపీ స్కూల్‌ (తురక బడి)లో చదువుతున్న 168 మందిని, గచ్చపువీధి ఎంపీపీ స్కూల్‌లో చదువుతున్న 28 విద్యార్థులను జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో, బలిఘట్టం ఎంపీపీ స్కూల్‌లో చదువుతున్న 87 మంది విద్యార్థులను అదే కాంప్లెక్స్‌లో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తున్నారు. వేములపూడి ఎంపీపీ సూల్‌ (మెయిన్‌)లో చదువుతున్న 116 మంది విద్యార్థులను జడ్పీ ఉన్నత పాఠశాలలో కలుపుతున్నారు. 

Updated Date - 2021-10-25T06:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising