ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆర్‌బీకేల ద్వారా రైతులకు పూర్తి సేవలు’

ABN, First Publish Date - 2021-02-25T06:39:33+05:30

పంటల సాగుకు సంబంధించిన అన్నిరకాల సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామా ల్లోనే అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకురాలు జి.లీలావతి తెలిపారు.

రైతులకు సూచనలు ఇస్తున్న జేడీ లీలావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాయకరావుపేట, ఫిబ్రవరి 24 : పంటల సాగుకు సంబంధించిన అన్నిరకాల సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామా ల్లోనే అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా వ్యవసాయ  సహాయ సంచాలకురాలు జి.లీలావతి తెలిపారు. బుధవారం ఇక్కడ పాయకరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల ఆర్‌బీకేల ఇన్‌చార్జిలకు ఏర్పాటైన అవగాహన సదస్సులో మాట్లా డారు. వ్యవసాయ పరంగా రైతులకు ఎటు వంటి సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం  ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఈ క్రాప్‌ 81 శాతం పూర్తయినట్టు చెప్పారు.  ఎరువుల కోసం రైతులు మండల కేంద్రానికి రానవసరం లేకుండా  ఆర్‌బీకేల వద్ద ఐదు నుంచి ఆరు టన్నుల వరకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.  సాంకేతిక సమస్యలు తక్షణ పరిష్కారానికి 15525 టోల్‌ ఫ్రీ నంబరుకు రైతులు ఫోన్‌ చేయాలని సూచించారు.  ఏడీఏ సీహెచ్‌. లచ్చన్న, హబ్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, రవితో పాటు  ఏవోలు, ఈఏవోలు పాల్గొన్నారు.

 సస్యరక్షణతో అపరాల దిగుబడి

పాయకరావుపేట రూరల్‌: సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అపరాలలో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లీలావతి అన్నారు. మంగవరంలో బుధవారం నిర్వహించిన పొలం బడిలో మాట్లాడారు.


Updated Date - 2021-02-25T06:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising