ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యం

ABN, First Publish Date - 2021-10-29T05:06:05+05:30

ఏజెన్సీలో 1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పీఏ శోభ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న జీసీసీ ఎండీ శోభ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జీసీసీ ఎండీ పీఏ శోభ

చింతపల్లి, అక్టోబరు 28: ఏజెన్సీలో 1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పీఏ శోభ తెలిపారు. గురువారం స్థానిక బ్రాంచి కార్యాలయంలో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల జీసీసీ అధికారులు, సేల్స్‌మన్‌, ఉమన్‌లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా జీసీసీ లాభాపేక్ష లేకుండా కాఫీ రైతులకు అంతర్జాతీయ ధరలను అందిస్తుందన్నారు. పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో కాఫీ గింజలు జీసీసీ కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేస్తామన్నారు. దళారీల వల్ల గిరిజన రైతులు నష్టపోతున్నారని, ఈసమస్యను పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాఫీ గింజల ధరను అపెక్స్‌ కమిటీ సూచన మేరకు ప్రాథమికంగా నిర్ణయించడం జరిగిందని, ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ప్రకటిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు కూడా కొనుగోలు చేసేందుకు  ప్రణాళిక సిద్ధం చేశామని జీసీసీ ఎండీ శోభ అన్నారు. గిరిజన రైతులు పండించిన రాగి(చోడి), రాజ్‌మా, పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.  ఈకార్యక్రమంలో జీఎం చిన్నబాబు, డీఎం కె.పార్వతమ్మ, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మేనేజర్ల బి.అప్పలరాజు, మురళీకృష్ణ, సరమండ విజయకుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising