ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2021-12-22T06:07:01+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
అన్ని మండలాల్లో కేక్‌లు కట్ చేసిన ఎమ్మెల్యే బాబూరావు
పేదలకు దుస్తులు, విద్యార్థులకు సామగ్రి పంపిణీ
పాయకరావుపేట, డిసెంబరు 21: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కేక్ కట్ చేసి, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబూరావు, గూటూరు శ్రీనివాసరావు, లంక సూరిబాబు, ఇసరపు తాతారావు, గారా ప్రసాద్, జగతా శ్రీను, కాదా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వై జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అభివృద్ధి సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు కేక్ కట్ చేశారు. పీహెచ్‌సీలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా, నాయకులు వంగలపూడి రాము, తోట కిరణ్, బాలకృష్ణారెడ్డి, కొప్పిశెట్టి మోహన్, అంబటి సీతారాం, తదితరులు పాల్గొన్నారు.
పాయకరావుపేట రూరల్: మండలంలోని శ్రీరాంపురంలో జిల్లా వ్యవసాయ అభివృద్ధి సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు కేక్ కట్ చేసి విద్యార్థులకు వాటర్ బాటిల్స్, కలర్ పెన్సిల్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 22న పాల్మన్‌పేట, 23న మాసాహెబ్‌పేట, 24న మంగవరం, 25న నామవరంలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు చిక్కాల రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దగ్గుపల్లి సాయిబాబా, కోడా కోటేశ్వరరావు, పన్నీరు బాబ్జీ, రామగోవిందు, పల్లెల స్వామి, కె.నరేశ్, సతీశ్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల: మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేగొల్ల బాబూరావు కేక్ కట్ చేశారు. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి సాగిసీతబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిల్లాడ శ్రీనివాసరావు, వంతర వెంకటలక్ష్మి, పెట్ల రాంబాబు, కోరుప్రోలు శివ, బి.అనిల్‌కుమార్, సిద్దాబత్తుల నాగేశ్వరరావు, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డీవీ సూర్యనారాయణరాజు కైలాసపట్నం గ్రామంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. గర్భిణులకు మిఠాయి, గాజులు, పసుపు కుంకుమలు అందజేశారు.
ఎస్.రాయవరం: మండలంలోని కొరుప్రోలు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కేక్ కట్‌చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు చేకూరి శ్రీరామచంద్రరాజు, మాతా గురునాథరావు, కె.రాజారమేశ్ పాల్గొన్నారు. ఎస్.రాయవరంలో ఎంపీపీ బొలిశెట్టి శారదకుమారి, బొలిశెట్టి గోవిందు దంపతుల ఆధ్వర్యంలో జగన్ బర్త్ డే వేడుకలు జరిగాయి.
నక్కపల్లి: కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్ బర్త్ డే వేడుకలకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉపమాక వెంకన్న ఆలయంలో సీఎం జగన్ పేరున పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు పొడగట్ల పాపారావు, అయినంపూడి మణిరాజు, వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, గొర్ల నరసింహమూర్తి, గోవింద్, ఎల్లేటి సత్యనారాయణ, అల్లాడ కొండ, వీసం రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-22T06:07:01+05:30 IST