ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం ప్రకటన వెనక్కితీసుకోవాలి

ABN, First Publish Date - 2021-07-30T05:24:14+05:30

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రకటనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు.

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  డిమాండ్‌ 


ఉక్కుటౌన్‌షిప్‌, జూలై 29: స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రకటనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్లాంట్‌ను 100 శాతం అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, తాజాగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా  అసంబద్ధ  ప్రకటన చేసిందని ఆరోపించారు. శాంతియుతంగా పోరాటాలు చేస్తున్న కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతోందన్నారు. ప్రజా సంపదను కేంద్రం కార్పొరేట్‌లకు తక్కువకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని, తక్షణమే దీనిని విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వై.టి.దాసు, గంధం వెంకటరావు, కెఎస్‌ఎన్‌.రావు, బి.మురళీరాజు, మస్తానప్ప, జి.గణపతిరెఇ్డ, డీవీ.రమణారెడ్డి, సురేష్‌బాబు పాల్గొన్నారు. ఈ మేరకు పరిపాలన భవనం వద్ద నిరసన చేపట్టిన కార్మిక వర్గం భవవం లోపలకు వెళ్లేందుకు విఫలయత్నం చేసింది.


అమృతరావు స్ఫూర్తితో పోరాటం 

అమృతరావు పోరాట స్ఫూర్తితో ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. కేంద్రం వైఖరిపై గురువారం అమృతరావు విగ్రహం వద్ద  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ నాడు ప్లాంట్‌ స్థాపన కోసం  అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష  చేశారని, అదే పంథాను ఇప్పుడూ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైటీ దాస్‌, మంత్రి రాజశేఖర్‌, వై.మస్తానప్ప, గంగవరం గోపి పాల్గొన్నారు. 


కేంద్రానికి తెలుగోడి సత్తా చూపుదాం

ప్లాంట్‌ను అమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటే తెలుగోడి సత్తా కేంద్రానికి చూపుతామని ఉక్కు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి అన్నారు. ప్లాంట్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాంట్‌ను నిర్మిస్తామని చెప్పడంతో ఉపాధి లభిస్తుందని ఎంతో మంది భూములు ఇచ్చారని,  నేటి వరకు నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు. నిర్వాసిత నిరుద్యోగులకు ఆర్థిక సహాయంతో పాటు మిగులు భూములు తిరిగి ఇచ్చేయాలన్నారు. కార్యక్రమంలో యేల్లేటి శ్రీనివాసరావు, జెర్రిపోతుల ముత్యాలు, కణితి అప్పలరాజు, దొమ్మేటి అప్పారావు పాల్గొన్నారు. 


ఐక్య పోరాటాలే శరణ్యం

కార్మిక వర్గం, నిర్వాసిత నిరుద్యోగులు, అధికారులు కలిసి ఐక్య పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందని ఇంటక్‌ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ అన్నారు. ప్లాంట్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోందని,  కార్పొరేట్లకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకోవాలన్నారు. గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రరావు, పీవీ.రమణమూర్తి, సంపూర్ణం, ఎండి.రఫీ, మోహన్‌, గంగవరం గోపి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising