అమ్మో...వీడు మామూలోడు కాదు!
ABN, First Publish Date - 2021-01-12T05:37:20+05:30
అర్జంట్ కాల్ చేయాలంటూ సెల్‌ఫోన్ తీసుకుని దానితో వుడాయించాలని చూసిన నాగవరపు అంజి అనే వ్యక్తిని స్థానికులు పట్టుకుని ద్వారకా పోలీసులకు అప్పగించారు.
అర్జంటుగా ఫోన్ చేయాలని సెల్‌ఫోన్‌కు వినతి
మాట్లాడుతున్నట్టు నటిస్తూ వుడాయింపు యత్నం
స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగింత
సీతంపేట: అర్జంట్ కాల్ చేయాలంటూ సెల్‌ఫోన్ తీసుకుని దానితో వుడాయించాలని చూసిన నాగవరపు అంజి అనే వ్యక్తిని స్థానికులు పట్టుకుని ద్వారకా పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు... ఆశీల్‌మెట్ట జంక్షన్‌లోని ఓ టీస్టాల్ వద్దకు సోమవారం అంజి వచ్చాడు. అర్జంటుగా కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అక్కడ టీ తాగుతున్న ఓ వ్యక్తిని అడిగి సెల్‌ఫోన్ తీసుకున్నాడు.
ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటించి పారిపోబోయాడు. దీంతో ఫోన్ యజమానితోపాటు ఇతరులు అప్రమత్తమై అతన్ని పట్టుకున్నారు. ఘటనపై ఎం.వెంకటరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం ఎస్‌ఐ లూథర్‌బాబు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2021-01-12T05:37:20+05:30 IST