ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఎస్పీ ధర్నా

ABN, First Publish Date - 2021-03-05T06:41:22+05:30

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచనను ప్రధాని మోదీ విరమించుకోకపోతే దేశ ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు హెచ్చరించారు.

ధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, మార్చి 4: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచనను ప్రధాని మోదీ విరమించుకోకపోతే దేశ ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్‌ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బోను కృష్ణ ఆఽధ్వర్యంలో పెందుర్తి మండల పరిషత్‌ ఆవరణలోని  అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా లకే రాజారావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే ప్లాంట్‌ కార్పొరేట్‌ సంస్థల గుత్తాధిపత్యంతో నిరంకుశ విఽఽధానాలు అమలు అవుతాయన్నారు. ఈ క్రమంలో వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారన్నారు. బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బోను కృష్ణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల హక్కు అని, ప్రైవేటీకరణ జరిగితే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గుదే ముత్యాలరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-03-05T06:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising