ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల ఖ్యాతికి వారధి ప్యాకేజింగ్‌

ABN, First Publish Date - 2021-10-29T06:16:01+05:30

ప్యాకేజింగ్‌ వ్యవస్థ పరిశ్రమల ఖ్యాతిని పెంచుతుందని కేంద్ర మినిస్ర్టీ, ఇండస్ర్టీ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.కిశోర్‌ చెప్పారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రత్యేక కార్యదర్శి కిశోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మినిస్ర్టీ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ర్టీ ప్రత్యేక కార్యదర్శి కిశోర్‌


అచ్యుతాపురం, అక్టోబరు 28: ప్యాకేజింగ్‌ వ్యవస్థ పరిశ్రమల ఖ్యాతిని పెంచుతుందని కేంద్ర మినిస్ర్టీ, ఇండస్ర్టీ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.కిశోర్‌ చెప్పారు. స్థానిక ఏపీఐఐసీ భవనంలో గురువారం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అనేక సంస్థల ప్రగతికి ప్యాకేజింగ్‌ విధానం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ విధానం ద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు. ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ జేవీఎస్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్న విశాఖలో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి పి.వనమూర్తి మాట్లాడుతూ, ఐఐపీ శిక్షణ కేందద్రాలు యువతకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయన్నారు. కార్యక్రమంలో గవర్నింగ్‌బాడీ వైస్‌ చైర్మన్‌ ఎన్‌.ఎల్‌.ఎన్‌.రాజు, వరల్డ్‌ ప్యాకేజింగ్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఏవీపీఎస్‌ చక్రవర్తి, ఐఐపీ చేర్మన్‌ వెంకట్రామన్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ అన్వీర్‌ ఆలమ్‌, ఐఐపీ డిప్యూటీ డైరెక్టర్‌ నటరాజ్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు జి.సాంభశివరావు, పైడా కృష్ణప్రసాద్‌, కుమార్‌రాజా, సింబయాసిస్‌, ఓ.నరేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising