ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్ద చెరువు, లంబసింగి, తాజంగిలలో బోటు షికారు

ABN, First Publish Date - 2021-10-20T06:26:13+05:30

పట్టణంలోని పెద్ద చెరువుతో సహా విశాఖ ఏజె న్సీలోని తాజంగి, లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో బోటు షికారు ఏర్పాటుకు ప్రాజెక్ట్‌ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌ పవన్‌ తెలిపారు.

పెద్ద చెరువును పరిశీలిస్తున్న పవన్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పర్యాటక శాఖ జీఎం పవన్‌   

నర్సీపట్నం, అక్టోబరు 19 : పట్టణంలోని పెద్ద చెరువుతో సహా విశాఖ ఏజె న్సీలోని తాజంగి, లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో బోటు షికారు ఏర్పాటుకు ప్రాజెక్ట్‌ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌ పవన్‌ తెలిపారు.  మంగళవారం ఆయన నాలుగు జిల్లాల డివిజన్‌ అధికారి బాబూజీతో కలిసి నర్సీపట్నం పెద్ద చెరువును పరిశీలించారు. రావణాపల్లి రిజర్వాయర్‌ ఏఈ రవికుమార్‌ను చెరువు విస్తీర్ణం, ఆయకట్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  విలేఖర్లతో మాట్లాడుతూ పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎండీ ఎస్‌.సత్యనారాయణ సూచనల మేరకు బోటు షికారు ఏర్పాటుకు అవసరమైన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారు చేసేందుకు ఈ పరిశీలన జరుపు తున్నట్టు చెప్పారు. లంబసింగిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.2.5 కోట్లతో చేపట్టిన రిసార్ట్స్‌ నిర్మా ణం నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నర్సీపట్నంలోని రాయల్‌ పార్క్‌ రిసార్ట్స్‌ పరిశీలించామని, పర్యాటక శాఖ వెబ్‌ సైట్‌తో అనుసంధానం చేయడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. గతంలో నర్సీపట్నం పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని స్థానిక విలేఖరులు ఆయన దృష్టికి తీసుకురాగా, అప్పుడు అర్థిక సంవత్సరంలో నిధులు అయిపోయాయని, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేయాల్సిందేనని చెప్పారు. లంబసింగి టూరిజం మేనేజర్‌ అప్పలనాయుడు ఆయన వెంట ఉన్నారు. ఇదిలావుంటే, గొలుగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులకు బోటు షికారు సౌకర్యం అందుబా టులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ జీఎం మంగ ళవారం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పర్యాటక శాఖ విశాఖ డివిజనల్‌ మేనేర్‌ బాపూజీ, లంబసింగి టూరిజం మేనేజర్‌ ఎస్‌.అప్పలనాయుడు, రావణాపల్లి రిజర్వాయర్‌  జేఈ రవికుమార్‌, సర్పంచ్‌ కొల్లి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising