ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమిలి-భోగాపురం 6 లేన్ల రహదారి

ABN, First Publish Date - 2021-05-05T05:11:06+05:30

రాష్ట్ర మంత్రి వర్గం విశాఖపట్నానికి సంబంధించి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11 బీచ్‌ల అభివృద్ధి...5 ఎకరాల్లో స్కై టవర్‌

రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం


విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి వర్గం విశాఖపట్నానికి సంబంధించి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీచ్‌రోడ్డులో భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 19 కి.మీ. మేర ఆరు వరుసల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాల్సి ఉంది. అలాగే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 11 బీచ్‌లను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. ఇంతకు ముందు కొన్ని బీచ్‌లను గుర్తించినా వాటిని పూర్తిగా అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు వాటన్నింటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఐదు ఎకరాల్లో స్కై టవర్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఇది ఎక్కడ అనేది స్పష్టత ఇవ్వలేదు. గతంలో వీఎంఆర్‌డీఏ కైలాసగిరిపైనే స్కై టవర్‌ నిర్మాణానికి ప్రతిపాదించింది. అది కమిషనర్‌ మారగానే మూలకు చేరింది. కాపులుప్పాడలో ప్రత్యేత రాష్ట్ర అతిథి గృహం నిర్మాణం బాధ్యతలు పర్యాటక శాఖకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు వీఎంఆర్‌డీఏ ఈ బాధ్యతలు చూస్తోంది. 


Updated Date - 2021-05-05T05:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising