ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెవరేజెస్‌ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN, First Publish Date - 2021-01-27T06:17:21+05:30

బెవరేజెస్‌ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు.

మాట్లాడుతున్న జేవీ సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి

సీతంపేట, జనవరి 26: బెవరేజెస్‌ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. ద్వారకా నగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర కన్వీనర్‌ టి.మధు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టి.వి.రాజు, జె.కోటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 


నూతన కార్యవర్గం ఎన్నిక

ఇదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. యూనియన్‌ గౌరవ సలహాదారుడిగా జేవీ సత్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాఽథ్‌, అధ్యక్షునిగా టి.మధు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎస్‌.భాస్కర్‌ పవన్‌, ఉపాధ్యక్షులుగా కె.సత్యనారాయణ (ఏలూరు), ఆనంద్‌ (చిత్తూరు), ప్రధాన కార్యదర్శిగా జె.కోటేశ్వరరావు (గుంటూరు), సహాయ కార్యదర్శులుగా రామచంద్ర (కడప), ప్రసాద్‌ (విశాఖ), కోశాధికారిగా కె.సుబ్రహ్మణ్యం (విజయవాడ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Updated Date - 2021-01-27T06:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising