ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందాల తీరం..ఆదమరిస్తే ప్రమాదం!

ABN, First Publish Date - 2021-06-20T05:15:38+05:30

తీర ప్రాంతాలు.. కొందరు తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చు తున్నా పలువురి యువతలో మార్పు రావడం లేదు.

ప్రమాదమని తెలిసినా శిథిలావస్థకు చేరిన జెట్టీపైకి ఎక్కిన యువత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ‘పేట’ మండలంలో ఆకట్టుకుంటున్న సముద్ర ప్రాంతాలు

  రత్నయ్యమ్మపేట తీరంలో ప్రమాదకరంగా మారిన జెట్టీ

 ఆ పైనుంచి దూకేందుకు యువకులు ఉత్సాహం

 గతంలో పలువురు గల్లంతుతో ఆందోళన


పాయకరావుపేట రూరల్‌, జూన్‌ 19 : తీర ప్రాంతాలు.. కొందరు తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చు తున్నా పలువురి యువతలో మార్పు రావడం లేదు. ప్రమాదమని తెలిసినా సాహసాలు చేసిమరీ ఆయా ప్రాం తాలకు చేరుతున్నారు. పాయకరావు పేట మండలంలోని రత్నయ్యమ్మపేట, రాజానగరం, పాల్మన్‌పేట, పెంటకోట, గజపతినగరం సముద్ర తీరాలు విశే షంగా ఆకట్టుకుంటాయి. కొన్నిచోట్ల ఉన్న సరుగుడు, జీడి తోటలు మరింత ఆహ్లా దాన్ని పంచిపెడతాయి. దీంతో  దూర ప్రాంతాల నుంచి పర్యాటకులతో పాటు విశాఖ జిల్లా పాయకరావుపేట,  నక్క పల్లి తొండంగి, తూర్పు గోదావరి జిల్లా తుని, కోటనందూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఇక్కడి వస్తుంటారు. వీకెండ్‌ రోజులైన శని, ఆదివారాల్లో వీరి సందడి అంతా ఇంతా కాదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రత్నయ్యమ్మపేట తీరంలో ఉన్న జెట్టీపైకి పలువురు యువకులు వెళుతున్నారు. ఎస్‌ఓఎల్‌ హేచరీస్‌ సంస్థ నిర్మించిన ఈ జెట్టీ శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం కూలేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై నుంచి పలువురు యువకులు సముద్రంలోకి స్నానాలకు దూకుతుండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. గత నెలలో సామర్లకోటకు చెందిన యువకుడు దీనిపై నుంచి సముద్రంలోకి దూకి గల్లంతైన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు గత కొంత కాలంగా చోటుచేసుకుంటున్నా  యువ తలో మార్పు రావడం లేదు.  పోలీసులు గస్తీని ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-20T05:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising