ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలపై అప్రమత్తం కండి

ABN, First Publish Date - 2021-06-24T05:41:07+05:30

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టవద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ సూచించారు.

సీఐలకు మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నర్సీపట్నం, జూన్‌ 23 : కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టవద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ సూచించారు. నర్సీపట్నం రూరల్‌, టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పోలీస్‌ సిబ్బందికి వైసీపీ సీనియర్‌ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ గ్లౌజ్‌లను పంపిణీ చేసి మాట్లాడారు.  సెకెండ్‌ వేవ్‌లో ప్రభుత్వం, వైద్యులు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ చాలా మందిని కోల్పోయామన్నారు. పూర్తి స్థాయిలో కేసులు తగ్గక ముందే మళ్లీ థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు వస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, వైఎస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, పట్టణ, రూరల్‌ సీఐలు స్వామినాయుడు, శ్రీనివాసరావు, అయ్యరక బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కర్రి శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising